నితిన్ సినిమాకి స్టార్ టెక్నీషియన్స్

Published on Oct 8, 2019 11:12 pm IST

హీరో నితిన్ ‘రంగ్‌దే’ అనే కొత్త చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛ్ అయింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

తమ బ్యానర్లో నిర్మితమైన అన్ని సినిమాలను సాంకేతికంగా మంచి స్టాండర్డ్స్ ఉండేలా నిర్మించే సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని కూడా అలాగే తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందుకే స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఇండియాలోని ఉత్తమమైన సినిమాటోగ్రఫర్లలో ఒకరు పీసీ. శ్రీరామ్. ఈయన ఈ చిత్రానికి పనిచేయనున్నారు. శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నాయకన్, క్షత్రియ పుత్రుడు, గీతాంజలి, అపూర్వ సోదరులు’ లాంటి ఎన్నో సినిమాలకు గొప్ప ఛాయాగ్రహణం అందించారు.

గతంలో ఈయన నితిన్ కమ్ బ్యాక్ చిత్రం ‘ఇష్క్’కు కూడా సినిమాటోగ్రఫీ చేశారు. ఇక సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పనిచేయనున్నారు. సో.. సినిమా టెక్నికల్ గా అలరించడం ఖాయమన్నమాట. 2020 వేసవికి విడుదలకానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది.

సంబంధిత సమాచారం :

X
More