బాలీవుడ్ లో తెలుగు రైటర్ కి పొగడ్తల వర్షం.!

Vijayendra-Prasad
ప్రస్తుతం ఇండియాలో ఒక వారం గ్యాప్ లో రిలీజ్ అయిన రెండు ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇక్కడ జరిగిన చాలా అరుదైన సంఘటన ఏమిటీ అంటే ఈ రెండు సినిమాలకి కథా రచయితా ఒక్కరే కావడం. అది కూడా ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన రైటర్ కావడం విశేషం. ఆయనెవరో కాదు రాజమౌళి ఫాదర్ వివి విజయేంద్ర ప్రసాద్. ఆయన కథ అందించిన బాహుబలి మరియు బజ్రంగి భాయ్ జాన్ సినిమాలు ప్రస్తుతం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక రైటర్ లైఫ్ లో ఇలాంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుంటాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే తెలుగు రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని బాలీవుడ్ మీడియా మరియు సినీ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వరుసగా రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఆయన పేరు కూడా ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. సల్మాన్ ఖాన్ కోసం ఇది వరకూ చేయని ఓ పాత్రని క్రియేట్ చెయ్యడం అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. గతంలో రాజన్న అనే సినిమాని డైరెక్ట్ చేసిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఓ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇది కాకుండా ఓ తెలుగు – హిందీ ద్విభాషా చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేస్తున్నారు.

Exit mobile version