
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 7 ఏళ్ళ తర్వాత తన 150వ సినిమా తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి – రామ్ చరణ్ కలిసి డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ గా ఎంపిక చేసారు, అలాగే పూరి చెప్పిన కథని కూడా ఓకే చేసారు. అలాగే పూరి ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబందించిన నేరేషన్ కూడా ఇచ్చేసాడు. ఇదిలా ఉంటే చిరు 150వ సినిమాకి పూరి కాకుండా మరో డైరెక్టర్ కూడా మారే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మన కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్.
ఇండస్ట్రీలోని పలువురు చెబుతున్న సమాచారం ప్రకారం వివి వినాయక్ స్టార్ రైటర్ చిన్ని కృష్ణతో కలిసి చిరు కోసం 150 వ సినిమా కథని సిద్దం చేస్తున్నాడట. చిన్ని కృష్ణ చిరు ఇమేజ్ కి తగ్గట్టు, ఓ పక్కా కమర్షియల్ కథని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. గతంలో చిన్ని కృష్ణ చిరుకి ఇంద్ర సినిమా కథని అందిస్తే, వినాయక ఏమో చిరుతో ఠాగూర్ సినిమా తీసాడు. చిరు పూరి కథ లేక చిన్ని కృష్ణ కథ ఏదైనా సెలక్ట్ చేసుకుంటాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఫస్ట్ హాఫ్ తో చిరుని మెప్పించిన పూరి సెకండ్ హాఫ్ ని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. పైన చెప్పిన వార్తలో నిజం ఎంత ఉందో తెలియకపోయినా ఫిల్మ్ నగర్లో మాత్రం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇరువురు దర్శకుల్లో ఎవరో ఒకరు త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ ఇస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.