నిర్మాత బాధ్యతలు తలకెత్తుకున్న స్టార్ రైటర్ !

Published on Jul 9, 2018 9:06 am IST

సీరియల్ తో తన కెరీర్ ను మొదలు పెట్టి సినిమాలకి స్టార్ రైటర్ గా ఎదిగారు బుర్రా సాయిమాధ‌వ్‌. ప్రస్తుతం ఆయన తెలుగులో ఫుల్ బిజీ రైటర్. టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హావా నడుస్తోంది. సైరా, ఎన్టీఆర్, గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఇలా బయోపిక్ లన్నిటికీ బుర్రా సాయిమాధవే మాటలు అందిస్తున్నారు.

కాగా బుర్రా సాయిమాధ‌వ్‌ రచన చేస్తూనే నిర్మాణరంగంలోకి అడుగు పెట్టబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ‘సినిమా టాకీస్‌`’అనే తాను స్థాపించిన బ్యానర్లో వెబ్ సిరీస్‌లను నిర్మించటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు సాయిమాధ‌వే స్వయంగా ఈ స్క్రిప్ట్ ను రాశారు. మరి రైటర్ గా సక్సెస్ అయిన బుర్రా సాయిమాధ‌వ్‌ నిర్మాత‌గా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :