విజయవాడలో మొదలైన స్టార్ క్రికెట్ మ్యాచ్

విజయవాడలో మొదలైన స్టార్ క్రికెట్ మ్యాచ్

Published on Dec 14, 2014 11:52 AM IST

star-cricket-cup1

హుదూద్ తుఫాన్ వల్ల బాగా దెబ్బ తిన్న ఉత్తరాంధ్ర ప్రజల సహాయార్ధం టాలీవుడ్ క్రికెట్ అసోషియేషన్ ఆర్గనైజ్ చేసిన ఓ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మొదలైంది. తరుణ్ – శ్రీకాంత్ కెప్టెన్స్ గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్ లో టాలీవుడ్ స్టార్స్, యంగ్ హీరోస్, పలువురు హీరోయిన్స్ పాల్గొంటున్నారు.

యంగ్ హీరోలైన నాని, నిఖిల్, సుదీర్ బాబు, నవీన్ చంద్ర, సామ్రాట్, ప్రిన్స్, తదితరులు కూడా మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడకపోయినా, మ్యాచ్ ఆరంభానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ మ్యాచ్ లో గ్లామర్ మరియు ప్లేయర్స్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ప్రియమణి, శాన్వి, మధు శాలిని, రిచా పనాయ్ తదితర హీరోయిన్స్ వచ్చారు. ఈ మ్యాచ్ టీవీ 9లో కంటిన్యూగా లైవ్ ఇస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మనీని హుదూద్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు