రేపు.. రామ్ కొత్త సినిమా విషయాలు !

రేపు.. రామ్ కొత్త సినిమా విషయాలు !

Published on Oct 27, 2019 10:08 PM IST

rap

‘ఇస్మార్ట్ శంకర్’ సాధించిన గొప్ప విజయం హీరో రామ్ ని గట్టిగానే రీచార్జ్ చేసింది. రామ్ అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక పై ఎలాంటి సినిమాలు చేయాలో ఫిక్స్ అయిన రామ్ కొన్ని కథల్ని కూడా చూజ్ చేసి పెట్టుకున్నారు. కాగా తాజాగా దీపావళి కానుకగా తన అభిమానులకు తన తరువాత సినిమాకి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు తన తరువాత సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

కాగా ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. అయితే రామ్ తమిళ చిత్రం ‘తడం’ను రీమేక్ చేయాలనుకుంటున్నట్టు టాక్. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ అనే పేరు కూడా రిజిస్టర్ చేయించారు. మరి ఈ టైటిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమా లేక వేరే సినిమా కోసమా అనేది చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు