ఈ ‘స్టార్ డైరెక్టర్’ సినిమా ఇంకెప్పుడూ ?

ఈ ‘స్టార్ డైరెక్టర్’ సినిమా ఇంకెప్పుడూ ?

Published on Jul 16, 2019 4:20 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకుడిగా అనుకున్న సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత బోయపాటి శ్రీను బడ్జెట్ తగ్గించే క్రమంలో స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేశాడు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా ఇప్పటికి క్లారిటీ లేకపోయినా బోయపాటి మాత్రం స్క్రిప్ట్ ను పర్ఫెక్ట్ గా తయారుచేసాడట.

కాగా బోయపాటి చేసిన లేటెస్ట్ వర్షన్ బాలయ్య విన్నా.. ఇంకా ఆ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలుస్తోంది. బాగుందా..? లేక, మార్పులు ఏమైనా చేయాలా అనే సమాచారం కూడా ఇంకా బోయపాటికి అందలేదట. దాంతో సినిమా వదులుకోవాలా.. ? లేక బాలయ్య పిలుపు కోసం ఎదురు చూడాలో..? అని అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నాడట బోయపాటి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అలాగే ఈ కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో.. హిట్ అయితే మాత్రం బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు