
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సినిమాలలో హీరోని చాలా మాస్ గా, ఉన్నది ఉన్నట్టు ఘాటుగా మాట్లాడేలా చూపిస్తుంటాడు. అలాగే హీరోయిన్ ని కూడా చాలా సినిమాల్లో చాలా డేరింగ్ ఉన్న అమ్మాయిలా చూపిస్తుంటాడు. ముకుంద, కంచె అనే రెండు డిఫరెంట్ సినిమాల్లో సైలెంట్ గా ఉండే పాత్రలు చేసిన వరుణ్ తేజ్ ని ఒక దొంగగా మార్చి పూర్తి లౌడ్ గా చూపించనున్న సినిమా ‘లోఫర్’. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రకారం పూరి వరుణ్ ని పర్ఫెక్ట్ మాస్ ఓరియెంటెడ్ రోల్ లో చూపించనున్నాడని అర్థమైపోయింది.
మామూలుగా పూరి చూపించే మాస్ ఇమేజ్ కోసం తనతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ మన వరుణ్ తేజ్ మాత్రం పూరి మాస్ ఇమేజ్ కంటే మించి లోఫర్ స్టొరీ మరియు అందులోని మదర్ సెంటిమెంట్ బాగా నచ్చి ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చాలా రోజుల తర్వాత పూరి చూపించిన మదర్ సెంటిమెంట్ అందరికీ నచ్చుతుందని వరుణ్ భావిస్తున్నాడు. వరుణ్ తేజ్ సరసన దిశా పాట్ని హీరోయిన్ గా నటించింది. సి కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.