Stranger Things 5: చిన్న రోల్ పెద్ద ఇంపాక్ట్.. వైరల్ గా మారిన బుడ్డోడు

Stranger Things 5: చిన్న రోల్ పెద్ద ఇంపాక్ట్.. వైరల్ గా మారిన బుడ్డోడు

Published on Jan 2, 2026 12:30 PM IST

Stranger Things 5

ఓటిటి సెన్సేషన్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (Stranger Things 5 Final) ఇప్పుడు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సిరీస్ కి సాలిడ్ ఎండింగ్ తో మేకర్స్ నిన్నటితో ముగించేశారు. దాదాపు తొమ్మిదేళ్ల ప్రయాణం ఎట్టకేలకి మంచి మెమోరీస్ ని ఆడియెన్స్ కి అందించింది. అయితే ఈ సీజన్ 5 లో కొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చాయి. మరి వీటిలో ఓ బుడ్డోడు ఇప్పుడు వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతున్నాడు.

Delightful Derek – నెగిటివ్ గా మొదలై డిలైట్ ఫుల్ డెరిక్ గా..

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (Stranger Things 5) మొదటి ఎపిసోడ్ లోనే అందరి దృష్టిని ఆకర్షించిన రోల్ డెరిక్ పాత్ర. చూడ్డానికి బుజ్జి పిల్లాడిలా కనిపించే ఈ రోల్ ని జేక్ కొనలి (Jake Connelly) అనే బాలుడు చేసాడు. అయితే తన రోల్ ఇందులో నెగిటివ్ గా స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు చాలా మందికి హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు.

పాత్ర చిన్నదే ప్రభావం పెద్దది..

కొన్నిసార్లు కొంతమంది నటులు లేదా పాత్రలు చిన్న పాత్రల్లో చాలా తక్కువ టైం మాత్రమే కనిపించినప్పటికీ వారి కోసం ఎక్కువగా మాట్లాడుకుంటారు. అలా ఈ డెరిక్ రోల్ సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మెయిన్ గా తన డైలాగ్స్, విలన్ రోల్ వెక్నాకే వార్నింగ్ ఇచ్చే సీన్స్ గత సీజన్ 5 రెండు వాల్యూమ్స్ నుంచి క్రేజీగా వైరల్ అయ్యాయి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో కూడా డైలాగ్ మంచి వైరల్ గా మారింది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మన తెలుగు ఆడియెన్స్ కూడా గట్టిగా కనెక్ట్ అయ్యి షేర్ చేసుకుంటున్నారు.

ఇలా ఈ బుడ్డోడు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా వెస్ట్రన్ ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాల్లో లేదా సిరీస్ లలో కనిపిస్తాడో చూడాలి.

తాజా వార్తలు