ఓటిటి సమీక్ష: ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ & గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి సమీక్ష: ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ & గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Jan 2, 2026 1:03 AM IST

Stranger Things

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : నెట్‌ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : మిల్లీ బాబీ, నోవాః స్క్నాప్, జేమీ కాంప్ బెల్ బోవెర్ ,ఫిన్ వోల్ఫ్ హార్డ్, డేవిడ్ హార్బర్, గెటెన్ మటరాజో, కాలెబ్ మెక్లాంగ్లిన్, జో కెరీ, తదితరులు
దర్శకులు : ది డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్), షాన్ లెవీ
నిర్మాత : హీలేరి లేవిట్
సంగీతం : కైల్ డిక్సన్, మైఖేల్ స్టైన్
సినిమాటోగ్రఫీ : కాలెబ్ హేయ్ మాన్
ఎడిటింగ్ : డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రపంచ ఓటిటి వీక్షకులు మన ఇండియన్ ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ అందుకున్న పాపులర్ వెబ్ సిరీస్ లలో స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things) కూడా ఒకటి. ఎప్పుడో 2016లో మొదలైన ఈ సిరీస్ దాదాపు తొమ్మిదేళ్ల ప్రయాణంలో మొత్తం 5 సీజన్స్ తో ఎండ్ కి తీసుకొచ్చారు. ఇలా వరల్డ్ వైడ్ గా గత ఏడాదికి ముగింపు, ఈ ఏడాదికి ఆరంభంగా చిట్ట చివరి సీజన్ ఇంకా చివరి ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఇక ఈ ఎండింగ్ ఎలా ఉంది. ఫ్యాన్స్ ని మెప్పించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

(Stranger Things 5) కథ:

గత 7వ ఎపిసోడ్ చివరిలో వెక్నా/ హెన్రీ (జేమీ కాంప్ బెల్ బోవెర్) అంతు చూసేందుకు మొత్తం గ్యాంగ్ విల్ (నోవాః స్క్నాప్), డస్టిన్ (గెటెన్ మటరాజో), స్టీవ్ హారింగ్ టన్ (జో కెరీ), మ్యాక్స్ (సదీ సింక్), కాళీ (లిన్నీ బెర్తెల్సన్) సహా ఎల్ (మిల్లీ బాబీ) తన తండ్రి జిమ్ హాప్పర్ (డేవిడ్ హార్బర్), జాయిస్ బైర్స్ (వైనోనా రైడర్), మాక్స్ (సాడీ సింక్), జోనాథన్ బైర్స్ (చార్లీ హీటన్), ముర్రే బామన్ (బ్రెట్ గెల్మాన్) లు సక్సెస్ ఫుల్ గా అప్ సైడ్ డౌన్ లోకి వెళతారు. కానీ వారి కోసం హాకిన్స్ సిటీ సైనిక దళం నాయకురాలు డాక్టర్ కే (లిండా హమిల్టన్) తన బలగాన్ని కూడా కొందరిని పంపుతుంది. మరి అప్ సైడ్ డౌన్ లోకి వెళ్లిన ఎల్ బృందం వెక్నాను చేరుకునేందుకు ఎలా ప్లాన్ చేశారు? దాన్ని ఎలా చేరుకున్నారు? ఈ క్రమంలో హెన్రి కోసం తెలుసుకున్న మరో నిజం ఏంటి? అతను ఎందుకు అలా మారాడు? చివరికి వెక్నాని అంతం చేసారా లేదా? ఈ మొత్తంలో ఎవరు త్యాగం చేశారు? ఈ చివరి ఎపిసోడ్, మొత్తం సిరీస్ కి ఒక మంచి అడ్వెంచర్ అండ్ ఎమోషనల్ ముగింపుగా నిలిచిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ ఫైనల్ ఎపిసోడ్ చూసి తీరాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చివరి సీజన్ పట్ల హైప్ భారీ లెవెల్లో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ మొత్తం మూడు భాగాలుగా విడదీసి తీసుకొచ్చిన ఎపిసోడ్స్ లో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఒక మ్యాడ్ ట్రీట్ ని అందించాయి. అలాగే తర్వాత వచ్చిన మూడు ఎపిసోడ్స్ లో మాత్రం మూడో ఎపిసోడ్ కి కొంచెం అండర్ పెర్ఫామ్ రెస్పాన్స్ వచ్చింది. మరి అలాంటి ఒక తక్కువ మూమెంట్ ని అంతా ఎదురు చూస్తున్న ఫైనల్ ఎపిసోడ్ (Stranger Things 5 Final Episode) మాత్రం ఒక పక్కా బ్యాంగర్ ఎపిసోడ్ అని చెప్పడంలో సందేహమే లేదు.

ఈ పర్టిక్యులర్ సిరీస్ అభిమానులకి ఈ సిరీస్ అంటే ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ని గత 7 ఎపిసోడ్స్ లో అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా లేదు అనుకునేవారికి ఈ ఒక్క ఎపిసోడ్ కావాల్సినంత రేంజ్ లో అందిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం ఎపిసోడ్ ఈజీగా 2 గంటలు ఉన్నప్పటికీ మొత్తం ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా సాగింది.

మంచి హై మూమెంట్స్, కావాల్సినంత గ్రాండ్ విజువల్స్, యాక్షన్ అండ్ అడ్వెంచర్ లతో మొదటి సగం సాగితే దానికి తగ్గట్టుగానే మిగతా సగం కూడా ఎమోషనల్ గా దర్శకులు డఫర్ బ్రదర్స్ మైంటైన్ చేసి సక్సెస్ అయ్యారు. విల్, మైక్, డస్టిన్, లూకస్, ఎల్ ఇలా అందరి పాత్రలు వారి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ చాలా మందికి పర్శనల్ గా ఇష్టమైన అంశం, మళ్ళీ వారి మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో తెరకెక్కించి సిరీస్ ఫ్యాన్స్ కి ఒక కంప్లీట్ ప్యాకేజీ ట్రీట్ ని అందించారు.

దాదాపు అన్ని పాత్రలకి మంచి ముగింపు ఇచ్చి ఈ సిరీస్ ని ఎలా ముగిస్తారా అని చూసిన ఫ్యాన్స్ కి ఒక హ్యాపీ ఎండింగ్ తో దీనిని ముగించడం విశేషం. మెయిన్ గా హెన్రీ ఎందుకు అలా అయ్యాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది రివీల్ చేశారు. అలాగే స్టీవ్, డస్టిన్, మ్యాక్స్ ఇంకా హోపర్, జాయిస్ పాత్రలు అందరికీ ఇచ్చిన హ్యాపీ ఎండింగ్ బాగుంది.

అంతే కాకుండా థ్రిల్ మూమెంట్స్ సహా క్లైమాక్స్ లో విల్, మైక్, లూకాస్, డస్టిన్, మ్యాక్స్ లు మాట్లాడుకుంటున్న సన్నివేశం అందులో ఎమోషనల్ మూమెంట్స్ మొత్తం సిరీస్ ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేస్తాయి. గత సీజన్స్ అన్నిటినీ ఒకసారి నెమరు వేసుకునేలా ఒక కంప్లీట్ ఫీల్ ని అందిస్తాయి. అలాగే ఎల్ పాత్రపై ఇచ్చిన ఒక హోప్ లాంటి ట్విస్ట్ సిరీస్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ. దీనితో ఇచ్చిన ఎండింగ్ ఎక్కడా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ప్లాన్ చేయడం మంచి విషయం.

మైనస్ పాయింట్స్:

ఫ్యాన్స్ కి ఎంతో నచ్చే రీతిలోనే సాగే ఈ ఫైనల్ ఎపిసోడ్ ఇంకా మొత్తం సిరీస్ ని గమనిస్తే కొన్ని లోటుపాట్లు కనిపిస్తాయి. ఈ సబ్జెక్టు ఒకింత యునిక్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న భూమి మీదే మనకి కనిపించని మరో డైమెన్షన్ లో మరో ప్రపంచం, అందులో ఒక స్నేహితులైన పిల్లలు ఇందులో చేసే అడ్వెంచర్ ప్రయాణం అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పొచ్చు.

కానీ ఇందులో విలన్ కి తగ్గ సాలిడ్ బ్యాక్ స్టోరీ కూడా అంతే ముఖ్యం, కాకపోతే ఈ చివరి ఎపిసోడ్ చూసాక అది కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఆలోచిస్తే మనకి స్పైడర్ మ్యాన్ 3 గుర్తు రావచ్చు. ఇందులో వెనమ్ కాన్సెప్ట్ తరహాలోనే ఇందులో కనిపిస్తుంది. సో ఇది ఒకింత సింపుల్ గానే అనిపించవచ్చు.

అలాగే ఇందులో బలమైన విలన్ వెక్నాని గన్ తూటాలు లాంటివే ఏమి చేయలేవు కానీ దానినే నడిపించే మైండ్ ఫ్లెయిర్ ని మాత్రం పిల్లలు సింపుల్ గా దాడి చేసేస్తారు. గాయాల పాలు చేస్తారు. ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన అంశమే.. ఇవి కాకుండా కొన్ని చోట్ల మాత్రం వి ఎఫ్ ఎక్స్ తేలిగ్గానే ఉన్నాయి.

సాంకేతిక వర్గం:

గత అన్ని ఎపిసోడ్స్ తో పోలిస్తే ఈ ఎపిసోడ్ లో అన్ని వర్గాల పనితనం చాలా బెటర్ గా ఉంది. యాక్షన్, వి ఎఫ్ ఎక్స్ ఇంకా సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ సాలిడ్ గా కుదిరాయి. సో వీటిలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఈ ఫైనల్ ఎపిసోడ్ కి ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అంతే కాకుండా తెలుగులో స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things) డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఆఫరిచినట్టు ఉంది.. అంటూ ట్రెండీ డైలాగ్స్ కూడా పెట్టారు.

ఇక దర్శకులు డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్) వర్క్ కూడా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పొచ్చు. అభిమానులు కోరుకునే ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ని ఈ సిరీస్ ని ముగించడం బాగుంది. ఈ లాస్ట్ ఎపిసోడ్ ని కూడా రెండు ఎపిసోడ్స్ గా చేసే స్కోప్ ఉంది కానీ రెండిటినీ కలిపి విడుదల చేయడంతో ఇందులో ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ అంతటిలో విలన్ రోల్ పరంగా మాత్రం తమ రైటింగ్ సింపుల్ గానే ఉందని చెప్పక తప్పదు. ఇది పక్కన పెడితే మాత్రం ఎంతోమందికి ఎమోషన్ అయిన ఈ సిరీస్ ని ఒక పక్కా బ్యాంగర్ క్లాసిక్ గా నిలిపి విడిచిపెట్టడం హర్షణీయం.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) దాదాపు 9 ఏళ్ల ప్రయాణం నేటితో ముగిసింది. ఈ సిరీస్ లో పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ వచ్చారో తమతో పాటే ఈ సిరీస్ ఫాలోవర్స్ కూడా పెరుగుతూ, తమ వాచ్ లిస్ట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ సిరీస్ కి ఇస్తూ వచ్చారు. మరి వారి అందరికీ ఈ ఫైనల్ ఎపిసోడ్ ఒక గ్రాండ్ ట్రిబ్యూట్ గా నిలిచింది. కావాల్సినంత యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్స్ ఇంకా ముఖ్యంగా ఎమోషన్స్ తో ఈ సిరీస్ ముగిసింది. ఒక రకంగా ఈ సిరీస్ ఫాలోవర్స్ ఇదొక పర్ఫెక్ట్ ఫేర్ వెల్. సో ఎలాంటి సందేహం లేకుండా ఈ ఎపిక్ సిరీస్ ని ఫైనల్ ఎపిసోడ్ తో ముగించి ఆ ఎమోషన్ ని మనసులో నింపుతుంది ఈ ఫైనల్ ఎపిసోడ్. దీనితో ఒక ఫరెవర్ ఫేవరెట్ సిరీస్ గా ఇదీ నిలిచిపోయింది. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సిరీస్ ని చూసేయొచ్చు.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు