‘తలా’ డైరెక్టర్ తో తలైవా మూవీ నా….?

Published on Aug 21, 2019 12:13 am IST

సూపర్ స్టార్ రజని ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో దర్బార్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.చాలా కాలం తరువాత రజని ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేస్తున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రజని సరసన నాయన తార హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా రజిని దర్బార్ మూవీ సెట్స్ పై ఉండగానే మరో చిత్రం ఒకే చేశారని తెలుస్తుంది. అజిత్ హీరోగా వీరం, వివేగం,వేదాళం,విశ్వాసం వంటి వరుస చిత్రాలు చేసిన మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రజిని సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కోలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్నవార్త.

సంబంధిత సమాచారం :