ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్ !

ఆకట్టుకుంటున్న ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్ !

Published on Oct 20, 2018 6:57 PM IST

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ‘సుబ్రహ్మణ్యపురం ‘ టీజర్ ను దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ లో ప్రధానంగా సుమంత్ ఓ నాస్తికుడు అని, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో సుమంత్ కనిపించనున్నాడని.. అలాగే దేవుడికి ప్లస్ మూఢ నమ్మకాలకి.. వర్సెస్ నాస్తికుడు అయినా హీరోకి మధ్య, ఈ సినిమా ఉండబోతుందని అర్ధం అవుతుంది.

కాగా విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ ఈ చిత్రం టీజర్ రాబట్టడం విశేషం. సుమంత్ కెరీర్ లోనే ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు