ఆగష్టులో రానున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’!

ఆగష్టులో రానున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’!

Published on Jul 2, 2015 5:11 PM IST

Subramanyam-for-Sale
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రేయ్’ తర్వాత సాయి ధరమ్ నటిస్తున్న మూడో సినిమాయే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.

ఇక ఈ మధ్యే అమెరికాలో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకుంది. హైద్రాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకు ఓ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగష్టు 28న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్‌రాజు భావిస్తున్నారట. ఇక ఈ విషయమై త్వరలోనే ఓ ప్రకటనను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు