ముందుగా ప్రకటించిన విధంగానే హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ ల ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా టీజర్ ని పండుగకానుకగా విడుదలచేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ టీజర్ కి యు ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
మిక్కీ జే మేయర్ నేపధ్య సంగీతం, తేజ్ డ్యాన్స్ మూవ్ లు వీక్షకులను అలరించాయి. ఈ ప్రాజెక్ట్ పై అటు దర్శకుడు, ఇటు హీరో నమ్మకంవ్యక్తం చేశారు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.


