‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘లవర్స్’ వంటి రొమాంటిక్ సినిమాలతో యువ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు సుమంత్ అశ్విన్. తాజాగా ప్రేక్షకులకు ప్రేమతో ‘చక్కిలిగింత’లు పెట్టడానికి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రెడీ అయిపోయాడు. సుమంత్ అశ్విన్ గత సినిమాలు మంచి విజయాలు సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలు తీసుకురావడంతో ‘చక్కిలిగింత’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఆడియో హిట్టవ్వడం కూడా అంచనాలు పెరగడానికి మరో కారణం. డిసెంబర్ 5న ‘చక్కిలిగింత’ విడుదలవుతుంది.
డిఫరెంట్ జోనర్ లో, కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు సుమంత్ అశ్విన్. సినిమా విడుదలైన తర్వాత అందరూ ఈ సినిమా గురించే చర్చించుకుంటారు అని చెప్పారు. ‘చక్కిలిగింత’ ప్రమోషనల్ కార్యక్రమాలలో కాన్ఫిడెంట్ గా కనిపించారు.
సుకుమార్ సన్నిహితుడు, రచయిత వేమా రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే, మేకింగ్ అంతా టిపికల్ సుకుమార్ స్టైల్లో ఉంటాయని సమాచారం. హీరోయిన్ గా పరిచయం అవుతున్న రెహానతో సుమంత్ అశ్విన్ ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించాడు. సినిమాకు ఆ సన్నివేశం చాలా కీలకం అట.


