దబాంగ్ 3లో ఈగ విలన్ !

దబాంగ్ 3లో ఈగ విలన్ !

Published on Jan 19, 2019 11:25 PM IST

దబాంగ్ , దబాంగ్ 2 చిత్రాల తరువాత ఈ సిరీస్ నుండి మూడవ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ముఖ్య పాత్రలో నటించనున్నారని సమాచారం. మక్కి (ఈగ) చిత్రం ద్వారా సుధీప్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రభుదేవా, దబాంగ్ 3 కథను సుధీప్ కు వినిపించడం ఆతరువాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందట. ఇక ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలు పెట్టి ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా సినిమాను ప్రేక్షుకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం ఓ పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథ తో తెరకెక్కనుందట. ఈ చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు ఘజియాబాద్ లో జరుగనుందని సమాచారం. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘భారత్’ చిత్రంలో నటిస్తూ బిజీ గా వున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు