ఆర్ ఆర్ ఆర్ ఆయన లేడంట..!

Published on Jan 19, 2020 8:43 am IST

కన్నడ సూపర్ స్టార్ సుధీప్ రెండు రోజులుగా తనపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఓ ప్రచారంపై స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఆయన తెలియజేశారు. విషయంలోకి వెళితే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో సుధీప్ ఓ కీలక రోల్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం జరిగింది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో ప్రధాన విలన్ రోల్ చేసిన సుధీప్, బాహుబలి చిత్రంలో కూడా ఓ సన్నివేశంలో తళుక్కున మెరిశారు. దీనితో రాజమౌళి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ సుధీప్ కి ఆర్ ఆర్ ఆర్ లో ఓ రోల్ ఆఫర్ చేశారని వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సుధీప్ ఇందులో ఎటువంటి నిజం లేదని, ఆర్ ఆర్ ఆర్ లో పాత్ర కోసం నన్ను ఎవరు సంప్రదించింది లేదని.. ఆయన స్పష్టత ఇచ్చారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుండి మొదలుకానుందని సమాచారం. లేటెస్ట్ షెడ్యూల్ నందు ఎన్టీఆర్ మరియు చరణ్ లు పాల్గొననున్నారట. ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More