సూపర్ స్టార్ ట్రైలర్ రేపే…!

Published on Aug 21, 2019 3:04 pm IST

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం పహిల్వాన్ . బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు, కన్నడ,తమిళ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.సుదీప్ ఈ మూవీ కొరకు దేశములోని అన్ని ప్రధాన పరిశ్రమల ప్రముఖులను కలిసి చిత్రానికి మంచి ప్రచారం కల్పించే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

కాగా రేపు పహిల్వాన్ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్ట్ ని విడుదల చేయడం జరిగింది. రేపు అన్ని భాషలలో ట్రైలర్ విడుదలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్. కృష్ణ నిర్మిచడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :