
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ‘ఈగ’ సినిమా ద్వారా సుధీప్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఆ సినిమాతో సుధీప్ తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లోనూ బాగా క్రేజ్ వచ్చింది. స్వతహాగా అతను కన్నడలో స్టార్ అయినప్పటికీ ఈగ సినిమా అతని స్థాయిని మరింత పెంచింది.
తాజాగా సుధీప్ హీరోగా తెలుగు ‘మిర్చి’ సినిమాకి రీమేక్ గా చేసిన ‘మాణిక్య’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు కూడా సుధీప్ చేసాడు. తనకు ఈ రేంజ్ స్టార్ ఇమేజ్ రావడానికి కారణమైన రాజమౌళికి సుధీప్ థాంక్స్ చెప్పాడు.
‘నా లైఫ్ లో ఇన్ని మాజికల్ మోమెంట్స్ ఇచ్చినందుకు రాజమౌళికి స్పెషల్ థాంక్స్ మరియు నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా ఫిల్మ్ మేకర్స్ కి కూడా థాంక్స్’ అని ట్వీట్ చేసాడు. మిర్చి రీమేక్ తో హిట్ అందుకున్న సుధీప్ త్వరలోనే పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాని రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.