సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెకండ్ సాంగ్ రిలీజ్

Published on Aug 18, 2022 2:00 am IST

సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. గతంలో సుధీర్, ఇంద్రగంటి ల కాంబినేషన్ లో వచ్చిన వి,సమ్మోహనం సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. దానితో వీరిద్దరి మూడవ కాంబో మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఒక సాంగ్, ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ లో మూవీ పై మంచి క్యూరియాసిటీని ఏర్పరిచాయి. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి పిజి విందా ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక నేడు ఈ మూవీ నుండి మీరే హీరోలా అనే పల్లవితో సాగె సాంగ్ ని కొద్దిసేపటి క్రితం ఒక ఈవెంట్ ద్వారా అఫీషియల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. సినిమాలో ఒక ప్రెస్ మీట్ సన్నివేశంలో భాగంగా వచ్చే ఈ సాంగ్ ని విజయ్ ప్రకాష్ పాడగా రామజోగయ్య శాస్త్రి రాసారు. ఆకట్టుకునే ట్రెండీ స్టైల్ బీట్ తో సాగె ఈ సాంగ్ ప్రస్తుతం మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :