ఖరారైన సుధీర్ బాబు కొత్త చిత్రం

ఖరారైన సుధీర్ బాబు కొత్త చిత్రం

Published on Mar 19, 2013 8:51 PM IST

Sudheer_Babu-(10)
సుధీర్ బాబు సరైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు. గడిచిన ఏడాదిలో ‘ఎస్.ఎం.ఎస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఈ యేడు ‘ప్రేమకథా చిత్రం’ ద్వారా మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి జే. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించగా మారుతి పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు సుధీర్ బాబు తన తరువాతి చిత్ర విశేషాలు వెల్లడించాడు. ఎస్.ఎస్ రాజమౌళి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఆర్.కే ఈ కొత్త సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా పేరు ‘ఆడు మగాడురా బుజ్జి’. ఈ సినిమా టైటిల్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలో ఒక సూపర్ హిట్ డైలాగు అవ్వడం యాదృచికం. ఈ సినిమా చిత్రీకరణ మార్చి 20నుండి మొదలుకానుంది. శ్రీ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.

ఈ సినిమా కాకుండా సుధీర్ బాబు సుకుమార్ అసోసియేట్ అయిన మున్నా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రం’ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నెల చివరలో ఒక పాటను చిత్రీకరిస్తారు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 10న మరియు చిత్రాన్ని మే 10న విడుదల చేయనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు