కొత్త సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా సుధీర్ బాబు

కొత్త సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా సుధీర్ బాబు

Published on Jul 14, 2015 1:50 PM IST

sudheer-babu
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన యువహీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అంటూ రెండు వరుస సినిమాతో మెప్పించిన ఈ హీరో వెంటనే తన తరువాతి సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమైపోయారు.

శ్రీరామ్ ఆదిత్య అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లోని సింగపూర్ టౌన్‌షిప్ పరిసరాల్లో జరుగుతోంది. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను 70ఎమ్.ఎమ్. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్, జాకీ షరఫ్ కుమారుడు టైగర్ షరఫ్ హీరోగా రూపొందుతోన్న భాగీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు