సర్ప్రైజింగ్ అదిరే గ్లింప్స్ ని గిఫ్ట్ గా ఇచ్చిన సుధీర్ బాబు.!

Published on May 31, 2022 11:00 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ డెడికేటెడ్ హీరో నైట్రో స్టార్ సుధీర్ బాబు తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఇలా ఫలితంలో సంబంధం లేకుండా ఏదో ఒక కొత్త రకంగా ట్రై చేస్తూ వచ్చే సుధీర్ బాబు నుంచి రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన చిత్రం “మామ మశ్చింద్రా”.

ప్రముఖ రచయితా దర్శకుడు హర్షవర్ధన్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈరోజు వారి కుటుంబ పెద్ద సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే కావడంతో ఈ సందర్భంలో ఈ చిత్ర యూనిట్ నుంచి సుధీర్ బాబు పై ఇంట్రెస్టింగ్ మరియు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ని గ్లింప్స్ గా అందించారు.

సుధీర్ బాబు ని మళ్ళీ సిక్స్ ప్యాక్ లో చూపించడమే కాకుండా తనలోని జిమ్నాస్ట్ ని సూపర్ స్టైలిష్ గా చూపించారు. మొత్తానికి అయితే సుధీర్ బాబు అదిరే గిఫ్ట్ ని ఈరోజు అందించాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :