ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – మా బ్యానర్ లో ప్రొడక్షన్ మాత్రం ఎప్పటికి ఆగదు.

ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – మా బ్యానర్ లో ప్రొడక్షన్ మాత్రం ఎప్పటికి ఆగదు.

Published on Sep 20, 2018 4:37 PM IST

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పై హీరోగా నటిస్తూ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాభ నటేష్ కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీరు హీరోగా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఉన్నట్లు ఉండి నిర్మాతగా మారి, ఎందుకు.. ఈ సినిమా నిర్మించాల్సి వచ్చింది ?

గతంలో నేను యాక్టర్ అవుదామని ట్రై చేస్తోన్న రోజుల్లో.. నేను కూడా కొన్ని రకాల తిరస్కరణలను ఎదుర్కొన్నాను. మంచి బాక్ గ్రౌండ్ ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ పరిస్థితి ఏమిటి ?.. నాకప్పటి నుంచి మనసులో ఉంది. నా కెరీర్ లో నేను కొంతవరకు సక్సెస్ అయ్యాక, ఆసక్తికరమైన స్క్రిప్ట్స్ తో వచ్చే కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలి అని. ఆ ఉద్దేశ్యంతోనే ఆర్ ఎస్ నాయుడుతో ఈ సినిమా చేశాను. తను చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇవన్ని ఒకవైపు అయితే.. ఇంకో యాంగిల్ ఉంది. నాతో పని చేసిన నిర్మాతల్లో… కొంతమందికి సరైన ఆసక్తి లేకపోవడం వల్ల నా సినిమాల్లో కొన్ని సినిమాలు బాగా రాలేదు. మరికొన్ని సినిమాలు బాగా వచ్చినా.. ఆ స్థాయిలో ప్రచారం పొందలేకపోయాయి. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొనే, నా స్వంత బ్యానర్ స్థాపించి.. నా సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాను.

మీ మాటలను బట్టి చూస్తే, మీరు చాలా ఫోకస్డ్ గా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తోంది. నిర్మాతగా మీ అనుభవం గురించి చెప్పండి ?

నిజానికి, నేను ఎప్పుడో నిర్మాతను అయిపోయాను. నా ఫస్ట్ సినిమాలో నేను కూడా కొంత ఇన్వెస్ట్ చేశానని చాలామందికి తెలియదు. ఏమైనా సినిమా నిర్మాణం గురించి నాకు కొంత అనుభవం కొంత జ్ఞానం అయితే ఉంది. అదికాక ఒక యాక్టర్ గా నేను ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేశాను. దీనివల్ల నాకు పని చాలా ఈజీ అయింది. బట్ నిర్మాత జాబ్ చాలా రిస్క్. మొత్తం టీమ్ ని ఓ స్ఫూర్తితో అతను ఒక్కడే ముందు ఉండి నడపాలి. అప్పుడే మంచి అవుట్ ఫుట్ వస్తోంది. ఒక నిర్మాతగా నేను ఈ సినిమాకి అదే చేశాను.

దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు ఓ కొత్త దర్శకుడు. మరి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ? ఎలా ఒప్పించారు ?

ఆర్ ఎస్ నాయుడు తీసిన ‘స్పందన’ అనే షార్ట్ ఫిల్మ్ నాకు బాగగా నచ్చింది. ఆ తర్వాత అతను చెప్పిన కథ కూడా నచ్చింది. సో.. ఫైనల్ గా ‘నన్ను దోచుకుందువటే’ సినిమా స్టార్ట్ అయింది. నేను తన వర్క్ లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఒక డైరెక్టర్ గా అతనికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి.. ఈ సినిమాని నిర్మించా.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ప్రాక్టికల్ గా పోకస్డ్ గా ఉంటుంది అంటున్నారు. అసలు మీ పాత్ర గురించి మీరు చెప్పండి ?

మీరు టీజర్ లో చూసి ఉంటారు. అంటే.. పెద్దగా ఎమోషన్ లేని ఓ బాస్ గా కనిపించబోతున్నాను. మీరన్నట్లు చాలా పోకస్డ్ గా ఉంటుంది. నా గోల్స్ తప్ప, వేరే ఎవర్నీ పట్టించుకోను. ప్రాక్టికల్ పర్సన్ లా అన్నమాట. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక, తనకి తెలియకుండానే తాను ఎలా చేంజ్ అయ్యాడు, ఆ క్రమంలో తాను ఏ సమస్యలను ఎదురుకున్నాడు అనేది చిత్రం కథ. సినిమాలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఈ చిత్రంలో మీ సరసన నటించిన హీరోయిన్ నాభ నటేష్ గురించి చెప్పండి ?

ఈ సినిమాలో నాభది చాలా ముఖ్యమైన రోల్. మేము తన్ని ఫైనల్ చేసిన రోజు, నేను నాభకి ఒక మాట చెప్పాను. ఈ సినిమా సక్సెస్ నీ పనితీరు మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని. బట్ నాభ నటేష్ మాత్రం ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా విడుదల తరువాత తనకి చాలా ఆఫర్స్ వస్తాయి. కెరీర్ లో తను చాలా దూరంగా వెళ్తుంది.

ఓవరాల్ గా ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల.. ఇటు హీరోగా, అటు నిర్మాతగా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ?

ఓవరాల్ గా నా సినిమా కెరీర్ లోనే.. నేను పెద్దగా సంపాధించింది ఏమిలేదని, చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన నా సినిమాల్లో సగానికి పైగా నేను చాలా తక్కువ రెమ్యునిరేషన్ కే పని చేశాను. కొన్ని సినిమాలు అయితే ఫ్రీగా కూడా చేశాను. కానీ ఈ సినిమా విషయంలో ఆర్థికంగా నేను చాలా సేఫ్ లో ఉన్నాను. ఈ సినిమా విజయం కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.

మీ ‘ఫ్యూచర్ ప్రాజెక్ట్స్’లో.. ఏ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారూ ?

ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ఇతర బ్యానర్ల సినిమాలతోనే బిజీగా ఉన్నాను. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో లీడ్ రోల్ చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది. అయితే నా బ్యానర్ లో సినిమాలను మాత్రం భవిష్యత్తులో నిరంతరం చేస్తూనే ఉంటాము. ఒకవేళ నాకు వయస్సు అయిపోయినా.. నా కుమారులు కొనసాగిస్తారు. అంతేగాక మా బ్యానర్ లో ప్రొడక్షన్ మాత్రం ఎప్పటికి ఆగదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు