సుదీర్ బాబు, నందిత జంటగా మరో సినిమా

సుదీర్ బాబు, నందిత జంటగా మరో సినిమా

Published on May 3, 2014 11:30 AM IST

Sudheer-Babu-and-Nandita
‘ప్రేమ కథ చిత్రం’తో ప్రేక్షకులను అలరించిన సుదీర్ బాబు, నందిత జంట మళ్ళి జత కట్టనున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కన్నడ సూపర్ హిట్ సినిమా ‘చార్మినార్’ తెలుగు రీమేక్ లో ఈ జంట కనబడనుంది. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాని నాగ చైతన్య హీరోగా తీయడానికి శ్రీధర్ అనుకుంటున్నారు అని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథాంశం ఒక యువకడు, అతడికి తన కుటుంబం స్నేహితులతో ఉండే అనుబంధాల చుట్టే తిరుగుతుంటుంది. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటుల ఇంకా తెలియాల్సి ఉంది.

లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఆఖరి సినిమా ‘పోటుగాడు’, మరికొన్ని కన్నడ సినిమాల రీమేక్ హక్కులను అయన దక్కిన్చుకునట్టు సమాచారం.

తాజా వార్తలు