రెండు సినిమాలను లైన్ లో పెట్టిన యువహీరో !
Published on Oct 31, 2017 10:54 am IST

యువ హీరో సుదీర్ బాబు చేసిన ‘ప్రేమకథ చిత్రమ్’ తరువాత అతను చేసిన సినిమాలు ఆశించిన విధంగా విజయం సాదించలేదు, ఈ మద్య ‘శమంతకమణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ హీరో నూతన దర్శకుడు రాజశేఖర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు సుదీర్ బాబు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

నటుడు హర్షవర్ధన్ ‘మనం’ సినిమాతో మాటల రచయితగా మారారు, తాజాగా ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ సినిమాతో దర్శకుడిగా ప్రక్షకుల ముందుకు రాబోతున్నారు, వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మద్య హర్షవర్ధన్, సుదీర్ బాబుకు ఒక పాయింట్ చెప్పడం జరిగిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు, అలాగే ఇంద్రగంటి దర్శకత్వంలో సుదీర్ బాబు మరో సినిమా చెయ్యబోతునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు విజయం సాదిస్తే సుదీర్ బాబు కెరీర్ మళ్ళి ఫామ్ లోకి రావడం ఖాయం.

 
Like us on Facebook