హిట్ సినిమాని వదులుకున్న సుధీర్ బాబు !
Published on Jun 14, 2018 12:58 pm IST

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘సమ్మోహనం’ . ఈ సినిమా రేపు ప్రేక్షకులముందుకు రానుంది . ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

2012లో నేను నటించిన మొదటి సినిమా ‘ఎస్ఎమ్ఎస్’ రిలీజ్ కు వారం రోజుల ముందు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ఒక సినిమాకు సైన్ చేశాను . ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల స్క్రిప్ట్ ను అందించారు . అనివార్య కారణాలవల్ల ఆ సినిమా తెరెకెక్కలేదు అని వివరించారు. తరువాత శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్ గా మారి ఆ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి నాగశౌర్య , రాశి కన్నా జంటగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాని తీశారు . ఈ సినిమా మంచి విజయం సాధించింది . అలా ఈ సూపర్ హిట్ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది సుధీర్ బాబు.

 
Like us on Facebook