కృష్ణమ్మ.. కోసం సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్..

కృష్ణమ్మ.. కోసం సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్..

Published on Aug 6, 2014 3:49 PM IST

suder-babu
‘ఆడు మగడ్రా బుజ్జి’ సినిమాలో 6 ప్యాక్ తో సందడి చేసిన సుధీర్ బాబు, తాజాగా నటిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. బెంగళూరు పరిసర ప్రాంతాలలో జరిగిన ఈ షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. జోగ్ ఫాల్స్ అంచుల వద్ద షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో సుధీర్ బాబు ఎటువంటి రోప్ సహాయం లేకుండా నటించారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కన్నడలో ఘన విజయం సాదించిన ‘చార్మినార్’ సినిమాకు రీమేక్ గా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ రూపొందుతుంది. సుధీర్ బాబు సరసన నందిత నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ‘చార్మినార్’ను తెరకెక్కించిన దర్శకుడు ఆర్.చంద్రు తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టొరీగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు