హీరో సుధీర్ బాబు ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే ఇంకోవైపు నిర్మాతాగానూ మారారు. కొత్త టాలెంట్ కు, ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆయన కొంత కాలం క్రితమే సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అందులో మొదటి సినిమా ఇప్పటికే మొదలై చివరి దశకు చేరుకుంది.
ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను ఆయన జూన్ 17వ విడుదలచేయనున్నారు. కొత్త దర్శకుడు రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటి నాబా నతేష్ కథానాయకిగా నటిస్తోంది. పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇకపోతే సుధీర్ బాబు నటించిన ‘సమ్మోహనం’ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకురానుంది.


