ఎన్టీఆర్ పాట నుండి సుధీర్ బాబు సినిమా టైటిల్ !
Published on Jun 17, 2018 5:50 pm IST

గత శుక్రవారం విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుని, నటుడిగా కూడ మంచి మార్కులు కొట్టేసిన హీరో సుధీర్ బాబు తన నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న మొదటి సినిమా టైటిల్ ‘నన్ను దోచుకుందువటే’ ను అనౌన్స్ చేశారు. టైటిల్ చూస్తుంటే ఈ టైటిల్ ఎన్టీఆర్ గారి క్లాసికల్ మూవీ ‘గులేబకావళి కథ’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘నన్ను దోచుకుందువటే’ నుండి స్ఫూర్తి పొంది తీసుకున్నట్లుగా ఉంది.

నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నాబా నతేష్ కథానాయకిగా నటిస్తోంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోట కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా యొక్క మోషన్ టీజర్ విడుదలైంది. ఈ చిత్రం కూడ ‘సమ్మోహనం’ మాదిరిగానే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook