ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్

Published on May 11, 2023 12:16 am IST


ప్రస్తుతం అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో మామా మశ్చీంద్ర అనే మూవీ చేస్తోన్న నైట్రో స్టార్ సుధీర్ బాబు, మరోవైపు యువ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నటిస్తున్న మూవీ హరోం హర. ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ మూవీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ పేరుతో గ్లింప్స్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేసారు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్ తో ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ మూవీని నిర్మిస్తున్నారు

1989 చిత్తూరు జిల్లా కుప్పంలో సాగె కథగా రూపొందిన ఈ మూవీ ట్రిగ్గర్ గ్లింప్స్ లో ‘అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు, కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది’ అంటూ సుధీర్ బాబు పలికిన డైలాగ్ బాగుంది. మొత్తంగా అయితే హరోం హర టీజర్ అందరినీ అలరించడంతో పాటు మూవీ పై మంచి అంచనాలు అయితే క్రియేట్ చేస్తోంది. కాగా ఈ భారీ పాన్ ఇండియన్ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా దీనిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా డిసెంబర్ 22న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :