సుధీర్ ఒకప్పటి సినిమాకి బాలీవుడ్ ప్రేక్షకుల ఫిదా.

Published on Jun 22, 2019 1:10 pm IST

హీరో సుధీర్ బాబు హీరోగా,నందిత హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన “కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని” మూవీకి ఊహించని ప్రశంసలందుతున్నాయి. అదేంటీ అప్పుడెప్పుడో 2015లో విడుదలైన మూవీకి ఇప్పుడు ప్రశంసలు అందుకోవడమేంటీ అని అనుకుంటున్నారా?. విషయం ఏమిటంటే ఈ చిత్రం “వోల్టేజ్ 420” పేరుతో హిందీలో అనువాదమై అక్కడ ఓ టీవీ ఛానల్లో ప్రసారమై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే యూట్యూబ్లో కూడా రెండు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా 60లక్షల వ్యూస్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాలో సుధీర్ నటనను నార్త్ ప్రేక్షకులు తెగపొగిడేస్తూ,మూవీని మిత్రులకు షేర్ చేస్తున్నారట. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన “భాగీ” మూవీలో విలన్ గా చేసిన సుధీర్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. త్వరలో గోపీచంద్ బయోపిక్ తో మరోసారి హిందీ ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.

అప్పట్లో కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన “కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని” మూవీ తెలుగులో అంతగా విజయం సాధించలేదు.కానీ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన ఈ చిత్రం ‘బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు గెలుచుకుంది.

సంబంధిత సమాచారం :

More