మణిరత్నం గురించి సుహాసిని ఏమన్నారంటే..

Published on Jun 17, 2019 8:05 pm IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు ఈరోజు ఉదయం నుండి వార్తలు హడావుడి చేస్తున్న స్నాగతి తెలిసిందే. సోషల్ మీడియా, వెబ్ మీడియాల్లో ఈ వార్త ప్రముఖంగా ప్రస్తావించబడింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా మణిరాంతంకు గుండెపోటు వచ్చి ఉడటంతో వార్తల్ని సులభంగానే నామేసిన అందరూ తమ అభిమాన దర్శకుడికి ఏమీ కాకూడదని కోరుకున్నారు.

కానీ సాయంత్రానికి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఆయన ప్రశాంతంగా తర్వాతి సినిమా పనులు చేసుకుంటున్నారని, రెగ్యులర్ హెల్త్ చెకప్ వలన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఇక కొద్దిసేపటి క్రితం మణిరత్నం సతీమణి సుహాసిని సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన భర్త ఉదయం 9:30 గంటలకు తనకిష్టమైన రోటీ, మామిడికాయ పచ్చడి తిని స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీసుకు వెళ్లిపోయారంటూ మణిరత్నంకు ఎలాంటి గుండెపోటు రాలేదని స్పష్టం చేశారు. ఇకపోతే మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More