ప్రభాస్ దర్శకుడితో గోపిచంద్ సినిమా ?

Published on Nov 24, 2020 1:04 am IST


కెరీర్లో రెండవ సినిమానే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుని అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు డైరెక్టర్ సుజీత్. ప్రభాస్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ తెలుగును మించి హిందీలో పెద్ద విజయాన్ని అందుకోవడంతో సుజీత్ పేరు దేశవ్యాప్తమైంది. అప్పటి నుండి సుజీత్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈమధ్య ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తారనే వార్త రాగా సుజీత్ దాన్ని ఖండించారు. ఏ రీమేక్ సినిమానూ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఆయన చేయబోయేది తెలుగు సినిమానే అని స్పష్టమైంది. ఇక తాజాగా ఆయన గోపిచంద్ హీరోగా సినిమా చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం కూడ హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందట. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రంలో నటిస్తున్నారు

సంబంధిత సమాచారం :

More