టీజర్ తోనే ‘సాహో’ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పిన సుజీత్ !

27th, April 2017 - 06:17:17 PM


ప్రభాస్- సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజయింది. 1 నిముషం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో ప్రభాస్ సరికొత్తగా కనిపించడమే కాక, స్టైలిష్ గా కూడా ఉన్నాడు. ఈ టీజర్ ద్వారా దర్శకుడు సుజీత్ సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో సింపుల్ గా చెప్పేశాడు. టీజర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ కంటెంట్ కు ఏమాత్రం కొదవలేదని ఇట్టే అర్థమైపోతుంది.

టీజర్ ఆరంభంలో వచ్చే విజువల్స్, ఎండింగ్ లో వచ్చే స్కై డైవింగ్ ఎపిసోడ్స్ సినిమా భారీతనాన్ని చాటుతున్నాయి. సుజీత్ ప్రపంచస్థాయి సాంకేతికతని సినిమా కోసం బాగానే ఉపయోగించినట్టు తెలుస్తోంది. అలాగే టీజర్లో ఇట్స్ షో టైమ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రూపొందిస్తున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి: