ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 07, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుజిత, రవి ప్రకాష్, అనిరుద్ తదితరులు
దర్శకత్వం : ఎస్ ఎస్ కాంచి
నిర్మాతలు : ప్రవీణ్ కడియాల, అనీల్ కడియాల
సంగీతం : ఎం ఎం కీరవాణి
ఛాయాగ్రహణం : వెంకట్
కూర్పు : మణి ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘చారులత’. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబీకుల నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
చారులత (సుజిత) కి అప్పటికే ఓ సారి పెళ్ళై తన భర్త నుంచి విడిపోతుంది, కానీ తన తల్లిదండ్రుల కోరిక మేరకు రెండో పెళ్ళికి అంగీకరిస్తుంది. అలా ఒక సింపుల్ మీట్ లో మిలింద్ (రవి ప్రకాష్) ని కలిసి తన విషయంలో కొన్ని షరతులు పెట్టి అలా అయితేనే తమ పెళ్లి జరుగుతుంది అని ఆమె చెబుతుంది. అప్పటికే తన మొదటి భార్యని కోల్పోయి ఉన్న మిలింద్ ఆమె చెప్పిన అన్ని షరతులకు ఓకే చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఇక అక్కడ నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగా జరిగిందా లేదా? అంత బాగా చూసుకుంటున్నప్పటికీ చారులత, మిలింద్ కి ఎందుకు విడాకులు ఇవ్వాలని చూస్తుంది? మరి వీరు కూడా విడిపోయారా లేక కలిసే ఉన్నారా అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఎవరైతే కొంచెం పరిపక్వతా ఆలోచనా విధానం కలవారు, తమ జీవితం పట్ల ఓ క్లారిటీ కావాలని కోరుకుంటారో అలాంటి వారికి ఈ లఘు చిత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దర్శకుడు ఎస్ ఎస్ కాంచి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తీసుకొని మంచి ఎమోషనల్ మూమెంట్స్ తో నడిపించి ఎండ్ చేయడం ఇందులో డీసెంట్ గా అనిపిస్తుంది.
ఇద్దరి మధ్య వయస్కులు వారి మధ్య దాంపత్య జీవితాన్ని తాను ఆవిష్కరించిన విధానం బాగుంది. ఆ పాత్రల్లో సుజిత, రవి ప్రకాష్ లు పర్ఫెక్ట్ గా సెట్టయ్యి ఆ పాత్రల్లో చాలా బాగా చేశారు. ఇద్దరి పాత్రలని కూడా కాంచి డిజైన్ చేసిన తీరు వాటికి ఇచ్చిన ముగింపులు బాగున్నాయి. ఇక మెయిన్ లీడ్ తో పాటుగా ఇతర నటీనటులు ఇందులో బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రాన్ని కాంచి డిజైన్ చేసుకున్న విధానం బాగున్నప్పటికీ మెయిన్ పాయింట్ అంతటినీ చివరిలో రివీల్ చేశారు. దీనికి ఎస్టాబ్లిష్ చేసిన ప్రయాణం అంతా చాలా రొటీన్ గానే సాగుతుంది. సో ఈ సన్నివేశాలలో కథనం అంత ఇంట్రెస్ట్ గా అనిపించదు.
అంతే కాకుండా కథనం కొంచెం సమయం తర్వాత రాజా రాణి లో ఆర్య, నయన్ ట్రాక్ కూడా ఇందులో గుర్తొస్తుంది. ఇంకో డిజప్పాయింటింగ్ అంశం ఏంటంటే ఎం ఎం కీరవాణి ఈ లఘు చిత్రానికి వర్క్ చేశారు కానీ నేపథ్య గీతాన్ని కూడా తన నుంచే తీసుకోవాల్సింది. నటీనటులు టెక్నికల్ గా స్కేల్ పెద్దగా ఉన్నప్పటికీ స్కోర్ ఇందులో ఆ రేంజ్ లో ఎలివేట్ అయ్యినట్టుగా అనిపించలేదు.
సాంకేతిక వర్గం:
సాంకేతిక వర్గ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కీరవాణితో పాడించిన రెండు బిట్ సాంగ్స్ కథనానికి అదనపు ఆకర్షణ అందించాయి. కానీ జీవన్ బాబు నేపథ్య సంగీతం అంత ఎఫెక్టీవ్ గా లేదు. వెంకట్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మొదటి సగం లో కొంచెం ఫాస్ట్ గా చేయాల్సింది.
ఎస్ ఎస్ కాంచి ఈ లఘు చిత్రాన్ని ఒక బెంగాలీ షార్ట్ కథ దేవ్ జని బసుకుమార్ ఆధారంగా తెలుగులో తన స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వంతో తీశారు. అయితే తాను ఈ చిత్రాన్ని అడాప్ట్ చేసుకొని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ కొన్ని నిమిషాల కథనాన్ని బాగా చూపించారు. దాదాపు పాత్రలని స్వచ్ఛమైన తెలుగు పదాలతోనే మాట్లాడించడం విశేషం. కాకపోతే మెయిన్ థీమ్ కి కావాల్సిన మొదటి కొంత కథనం మాత్రం ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. సో ఇది పక్కన పెడితే మిగతా వర్క్ అంతా బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘చారులత’ ఒక డీసెంట్ మెచ్యూర్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. దర్శకుడు కాంచి మంచి మాటలు, కథనం, ఎమోషన్స్ తో నడిపించిన తీరు ఇందులో బాగుంది. అలాగే సుజిత, రవి ప్రకాష్ లు కూడా మంచి పెర్ఫామెన్స్ లు ఇందులో అందించారు. మొదటి కొంతసేపు కథనం రొటీన్ గా ఉంది కానీ తర్వాత పికప్ అయ్యి చూసే వీక్షకునికి ఒక శాటిస్ఫై చేసే ముగింపు మిగులుస్తుంది. సో ఈ లఘు చిత్రాన్ని ఈటీవీ విన్ లో ట్రై చేయొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


