సుక్కు – విజయ్ సినిమా అప్పటి నుండే !

Published on Mar 6, 2021 5:03 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీరి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మొదలవుతుందట. సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు. అలాగే, ప్రీ-ప్రొడక్షన్ కి మరో మూడు నెలల టైం తీసుకుంటాడు కాబట్టి.. వచ్చే ఏడాదే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. అన్నట్లు ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు.

తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై కేదార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పైగా తన బ్యానర్ లో వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేయాలకుంటున్నాడట. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో చేస్తోన్న తన మొదటి సినిమాను కూడా పాన్ ఇండియా మూవీనే అట. సుక్కు – విజయ్ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి. మరి వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే చాల కొత్తగా ఉంటుందేమో.

సంబంధిత సమాచారం :