రామ్ చరణ్ తో ఆ పవర్ ఫుల్ ఇంట్రో ను ఆల్రెడీ షూట్ చేసిన సుకుమార్!

రామ్ చరణ్ తో ఆ పవర్ ఫుల్ ఇంట్రో ను ఆల్రెడీ షూట్ చేసిన సుకుమార్!

Published on Nov 2, 2022 4:39 PM IST

టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ లలో సుకుమార్ ఒకరు. పుష్ప ది రైజ్ చిత్రం తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం పుష్ప ది రూల్ ను డైరెక్షన్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ మరో సినిమా చేయనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి సైతం రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా పై చాలా ఆసక్తి కలిగించేలా వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్ మూవీ హిస్టరీ లోనే ఆ ఇంట్రో సీన్ టాప్ లో ఉంటుంది అని గతంలో తెలిపారు. అయితే ఈ ఇంట్రో సీన్ ను సుకుమార్ ఆల్రెడీ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేయడానికి ముందుగానే ఈ ఇంట్రడక్షన్ సీన్ ను పూర్తి చేయడం జరిగింది. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భారీగా కండలు తిరిగిన దేహాన్ని పెంచారు. అల్లూరి సీతారామరాజు గా, బ్రిటిష్ ప్రభుత్వం లో పని చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారి గా కనిపించిన రామ్ చరణ్, పోలీస్ పాత్ర కోసం ఆ దృఢమైన దేహాన్ని పెంచారు.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 కోసం వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ చిత్రం అనంతరం సుకుమార్ తోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా సుకుమార్ పుష్ప ది రూల్ ను ఫినిష్ చేయనున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు