
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన టేకింగ్ స్టైల్ ని ఈసారి తారక్ కి రుచి చూపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం తారక్ డిఫరెంట్ లుక్ తో కనిపించడం విశేషం, ఈ సినిమా ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అధికభాగాన్ని యునైటెడ్ కింగ్ డమ్ లో చిత్రీకరించనున్నారు.
తారక్ సరసన రకుల్ నటిస్తున్న ఈ సినిమా లోకేషన్ల వేటలో సుకుమార్ బృందం నిమగ్నమై వుంది. ఈ వేటలో భాగంగా సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ లతో సుకుమార్ సేల్ఫీ దిగారు. నాన్నకు ప్రేమతో అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

