చరణ్ తో సినిమాపై సుకుమార్ నుంచి క్లారిటీ!

Sukumar RamCharan m

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు భారీ చిత్రం “పెద్ది” చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న ఈ చిత్రం పట్ల పాన్ ఇండియా లెవెల్లో గట్టి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు గురువు దర్శకుడు సుకుమార్ తో చరణ్ 17వ సినిమా అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసిన తర్వాత మౌనంగా ఉండడం అనేది కొంచెం ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారింది. అయితే అసలు ఈ సినిమాపై స్వయంగా సుకుమార్ నుంచే క్లారిటీ వచ్చింది. తన స్వగ్రామం మలికిపురం వెళ్లిన సుకుమార్ అక్కడ తన తదుపరి చిత్రం రామ్ చరణ్ తోనే అని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సహా ప్రీప్రొడక్షన్ పనులు చేస్తున్నట్టుగా సెలవిచ్చారు. దీనితో చరణ్ తో సినిమాపై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పవచ్చు.

Exit mobile version