‘రంగస్థలం’ చిత్రంలోని పాటలు ఈరోజు విదుడాలి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుండగా యాదవ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ రాములు యాదవ్ మూడవ పాట ‘రంగమ్మ మంగమ్మ’ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాటలో ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లిరిక్ తమ కమ్యూనిటీలోని ఆడవాళ్లను తక్కువ చేసి చూపేలా ఉందని వెంటనే పాట నుండి ఆ మాటల్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన దర్శకుడు సుకుమార్ పాటలో ‘గొల్లభామ’ అనే మాట మనుషుల గురించి రాసింది కాదని, గొల్లభామ అంటే ఒక రకమైన పురుగుని, అది అందరికీ తెలిసే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి సుకుమార్ సమాధానంతో అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తులు అసలు విషయాన్ని గ్రహించి కాంట్రవర్సీకి తెరదించుతారో లేదో చూడాలి.


