“రిపబ్లిక్” ఇంటెన్స్ టీజర్ లాంచ్ చేయనున్న సుకుమార్.!

Published on Apr 4, 2021 1:01 pm IST

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి పడ్డాడు. పోస్ట్ కోవిడ్ తన “సోలో బ్రతుకే సో బెటర్” థియేట్రికల్ రిలీజ్ రీస్టార్ట్ చేసిన సాయి తేజ్ ఆ చిత్ర విజయంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్నాడు. మరి అందులో భాగంగా టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టా తో చేస్తున్న లేటెస్ట్ చిత్రం “రిపబ్లిక్” షూట్ శరవేగంగా దూసుకెళ్తుండడంతో పాటు మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా ఇంటెన్స్ టీజర్ ను టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తో విడుదల చేయిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. రేపు ఏప్రిల్ 5 ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఈ చిత్రం తాలూకా టీజర్ ను సుకుమార్ విడుదల చేస్తుండగా ఇది అంచనాలు మించే ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా జేబీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి అలాగే టాలెంటడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంని మేకర్స్ వచ్చే జూన్ 4న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :