సుకుమార్ – మహేష్ సినిమా పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

Published on Feb 4, 2019 9:35 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. కాగా అక్రమరవాణా చేసే మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ తర్జనభర్జన పడుతున్నారట. ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కి సంబంధించి రెండు మూడు రకాలుగా సుక్కు అనుకున్నాడట.

అయితే ఏది ఫిక్స్ అవ్వాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ కోసం చిత్రబృందం ఓ స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో వుంది. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం కూడా బాగానే సన్నద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :