‘రంగస్థలం’ కాపీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్ !

Published on May 29, 2018 8:53 am IST

సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ రూ.200 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దర్శకుడిగా సుకుమార్ ఇమేజ్ ఎంతగానో పెరిగింది. ఈ చిత్రంలోని చాలా అంశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో కథానాయకుడు ప్రతినాయకుడ్ని ఆపద నుండి బ్రతికించి మరీ చంపడం అనే చిత్ర క్లైమాక్స్ కూడ ఒకటి. అలాంటి ముగింపు రాసినందుకుగాను సుకుమార్ కు ఎన్నో ప్రశంసలు దక్కాయి.

కానీ ఈ క్లైమాక్స్ తనదని, సుకుమార్ దాన్ని కాపీ కొట్టారని రచయిత ఎం. గాంధీ రచయితల సంఘానికి పిర్యాధు చేశారు. దీనిపై స్పందించిన సుకుమార్ ఎం.గాంధీ ఎవరో తనకుగాని, తన నిర్మాతలకుగాని తెలియదని, ఎప్పుడూ కలవలేదని, కాబట్టి ఆయన కథను తాము కాపీ చేసే ఆస్కారమే లేదని అన్నారు.

అలాగే చిత్ర ముగింపును తాను ‘ధర్మ యుద్ధం’ అనే సినిమా చూసినప్పటి నుండి అనుకుంటున్నదని, ఇది చాలా పాత సినిమాల్లో, నవలల్లో ఉన్నదే అని, దాన్ని తాను ఏ విధానంతో రాసుకుంది కూడ సవివరంగా తెలియపరిచారు. సుకుమార్ ఇచ్చిన ఈ సమాధానంతో సంతృప్తి చెందిన రచయితల సంఘం గాంధీతో ఈ సమస్యను రచయితల సంఘం పరిష్కరించజాలదని, దీనిపై ఇంకా న్యాయం పొందాలి అనుకుంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించవచ్చని అనుమతిచ్చింది.

సంబంధిత సమాచారం :