టాలెంటెడ్ హీరోతో సుకుమార్ సినిమా !

దర్శకుడు సుకుమార్ ఒకవైపు సినిమాల్ని డైరెక్ట్ చేస్తూనే మంచి కథలు దొరికితే నిర్మాతగా మారి సినిమాల్ని నిర్మస్తుంటారు కూడ. ఇప్పటికే ‘కుమారి 21 ఎఫ్’ వంటి సినిమాని నిర్మించిన ఆయన ఇప్పుడు మరొక చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అది కూడా టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టితో కావడం విశేషం.

నవదీప్ తో ‘భమ్ బోలేనాథ్’ అనే సినిమాని తెరకెక్కించిన కార్తిక్ వర్మ ఈ చిత్ర్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఇంకొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో చేస్తున్న ‘రంగస్థలం’లో కూడ ఆది పినిశెట్టి ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.