మెగా హీరో మూవీకి సుకుమార్ కట్స్..!

Published on May 23, 2020 1:04 pm IST

మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సెన్సిటివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం ద్వారా వైష్ణవ్ వెండి తెరకు పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దేవిశ్రీ అందించిన సోల్ ఫుల్ ఆల్బమ్ ఇప్పటికే యూత్ ని ఆకట్టుకుంది. విడుదలకు ముంచే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

కాగా ఈ మూవీకి నిర్మాతగా ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఉప్పెన మూవీకి అవసరమైన కట్స్ చెప్తున్నారట. అలాగే మూవీ నిడివి 2:30 నిమిషాలకు తగ్గించారని వినికిడి. అలాగే మూవీ అవుట్ ఫుట్ చూసిన ఆయన సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఉప్పెన సినిమాలో ఓ కీలక రోల్ తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ థియేటర్స్ లో దిగనుంది.

సంబంధిత సమాచారం :

X
More