రాజ్ తరుణ్, షీనా బజాజ్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుమారి 21 ఎఫ్’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.
ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్లు అందరూ కలసి పనిచేస్తున్న ఈ సినిమాను కేవలం 40 నుండి 50 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యెలా ప్లాన్ చేశారు. అతి తక్కువ నిర్మాణ వ్యయంలో పక్కా ప్లాన్ తో సినిమాను ప్రణాళికా బద్దంగా నిర్మిస్తున్నారు.
‘కుమారి 21 ఎఫ్’తో సుకుమార్ నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై పీఏ మోషన్ పిక్చర్స్ సంస్థ – థామస్ రెడ్డి ఆదూరితో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


