‘అల్లుడు శీను’ విడుదలకు ముందే బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలో దర్శకులను ఆకర్షిస్తున్నాడు. హీరోగా పరిచయమవుతున్న తోలి సినిమా ‘అల్లుడు శ్రీను’ ట్రైలర్ తోనే టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు.
తాజా సమాచారం ప్రకారం.. బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా ఇది. ఈ వార్తను అధికారికంగా ద్రువీకరించాకపోయినా.. సుకుమార్ – శ్రీనివాస్ కలయికలో సినిమా తెరకెక్కనుందని సన్నిహితవర్గాలు తెలిపాయి.


