హీరో ఎవరైనా సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే

Published on Apr 8, 2020 12:40 pm IST

సుకుమార్-దేవిశ్రీలది సూపర్ హిట్ కాంబినేషన్. సుకుమార్ మూవీస్ ఫలితం ఎలా ఉన్నా దేవిశ్రీ సాంగ్స్ సూపర్ హిట్ కావలసిందే. సుకుమార్ మొదటిచిత్రం ఆర్య నుండి రంగస్థలం వరకు సుకుమార్ అన్ని చిత్రాలకు దేవిశ్రీ నే సంగీతం అందించారు. ఇక బన్నీ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీకి కూడా సుకుమార్ దేవిశ్రీ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇప్పటికే దీనిపై వార్తలు వచ్చినప్పటికీ నేడు అధికారికంగా బన్నీ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. హీరో ఎవరైనా దేవిశ్రీ ఫార్మ్ లో ఉన్నా లేకున్నా అతన్ని వదిలేది లేదని సుకుమార్ నిరోపించాడు.

నేడు సుకుమార్-బన్నీ చిత్రానికి పుష్ప అనే టైటిల్ నిర్ణయించారు. అలాగే ఈ చిత్రం లోని బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బన్నీ మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ కి విశేష ఆదరణ దక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్నిసుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More