అనుష్క తో ఆ సీన్ ఉంటుందని చెప్పి గుణశేఖర్ నన్ను మోసంచేశాడు-సుమన్

ఒకప్పడు మంచి యాక్షన్ హీరోగా ఒక వెలుగువెలిగిన సుమన్ ప్రస్తుతం పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. గుణశేఖర్ అనుష్క కంబినేషన్లో వచ్చిన “రుద్రమదేవి” మూవీ లో సుమన్ ప్రతినాయకుడిగా నటించారు. అప్పుడు గుణశేఖర్ కి సుమన్ కి మధ్య కొంత వివాదం నడిచింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ దర్శకుడు గుణశేఖర్ తనకి మధ్య తలెత్తిన వివాదం గురించి కొన్ని ఆసక్తికర సంగతులు బయటపెట్టారు. “రుద్రమదేవి” మూవీలో నాకు అనుష్క ల మధ్య క్లైమాక్స్ లో ఓ భారీ పోరాటసన్నివేశం ఉంటుందని చెప్పి తనను ప్రతినాయకుడి పాత్రకు ఒప్పించి చివరకు అలాంటి సన్నివేశం లేకుండానే సినిమా ముగించాడు. అంతే కాకుండా తనకు ఇవ్వవలసిన పారితోషకం కూడా సరిగా ఇవ్వలేదు” అని కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు సుమన్.